వచ్చేది మళ్లీ చంద్రబాబే
చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తారన్న నమ్మకం తనకు ఉందని సినీ నిర్మాత అశ్వనీ దత్ అన్నారు.;
చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తారన్న నమ్మకం తనకు ఉందని సినీ నిర్మాత అశ్వనీ దత్ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం తిరుమలను సర్వనాశనం చేసిందని ఆయన తెలిపారు. ఇప్పుడు అక్కడ జరగని పాపం లేదని అశ్వనీదత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఇప్పుడు జరిగే అన్యాయాన్ని కూడా ఊహించలేమని ఆయన అన్నారు.
తిరుమల సర్వనాశనం...
మూడేళ్ల కాలంలో తిరుమలలో ఎన్నో పాపాలు జరుగుతున్నా దేవుడు ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదని అశ్వనీదత్ అన్నారు. ఏపీలో ప్రస్తుతం బలవంతపు మతమార్పిళ్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై చినజీయర్ స్వామి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. జగన్ ను ఆయన దైవాంశ సంభూతిడిగా ఒక కార్యక్రమంలో పాగిడారని, ఆ మాట వినగానే తన కడుపు మండి పోయిందని అశ్వినీదత్ మండి పడ్డారు. ఏపీలో ప్రభుత్వ పాలన సజావుగా సాగడం లేదని, తిరిగి చంద్రబాబు రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.