శ్రీకాళహస్తి చొక్కాని ఉత్సవంలో అపశృతి.. దీపోత్సవంలో చెలరేగిన మంటలు
ప్రతి ఏటా మార్గశిర పౌర్ణమినాడు శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో చొక్కాని ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా భారీ..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన చొక్కాని దీప ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయంలో నిర్వహించిన చొక్కాని దీపోత్సవంలో మంటలు చెలరేగడంతో.. భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 8 మందికి గాయాలవ్వగా.. ఒక మహిళా సెక్యూరిటీ గార్డుకు చెయ్యి విరిగింది. గాయపడిన వారిలో ఐదుగురు భక్తులు, ముగ్గురు ఆలయ సిబ్బంది ఉన్నారు. వారందరినీ శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ప్రతి ఏటా మార్గశిర పౌర్ణమినాడు శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో చొక్కాని ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా భారీ దీపోత్సవం ఏర్పాటు చేస్తారు. ఆలయ పరిసరాల్లో 20 అడుగుల ఎత్తైన దీపాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ.. ఈసారి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా దీపోత్సవం నిర్వహించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యానికి తోడు.. భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడంతో మంటలు ఎగసిపడే సమయానికి తొక్కిసలాట జరిగింది.