హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన పీఎస్ఆర్
ఏసీబీ మాజీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టు ఎదుట నేడు హాజరయ్యారు. హైకోర్టకు క్షమాపణలు తెలిపారు
కరప్షన్ కేసుల్లో విచారణ జాప్యంపై హైకోర్టు సీరియస్ అయింది. దీంతో ఏసీబీ మాజీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టు ఎదుట నేడు హాజరయ్యారు. హైకోర్టుకు క్షమాపణలు తెలిపారు. కేసుకు సంబంధించి ఛార్జిషీట్ ను దాఖలు చేసినట్లు కోర్టుకు పీఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. గతంలో ఏసీబీ డీజీగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు.
కేసు విచారణలో జాప్యంపై....
ప్రకాశం జిల్లా కొమరోలులోని పీఎస్ఎల్వీ ఎడ్యుకేషన్ సొసైటీపై 2018 లో అవినీతి కేసు నమోదు అయింది. అయితే దీనిపై విచారించిన ఏసీబీ ఛార్జి షీట్ ను ఏళ్లు గడిచినా దాఖలు చేయలేదు. దీనిపై హైకోర్టు సీరియస్ కావడంతో పీఎస్ఆర్ ఆంజనేయులు స్వయంగా కోర్టుకు హాజరై క్షమాపణలు చెప్పారు. తదుపరి విచారణ నుంచి ఆయనకు మినహాయింపు నిచ్చింది.