Alla Nani : వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా
వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు
వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. తన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఏలూరులో వైసీపీ కార్యాలయం కూల్చివేత విషయంలో కూడా ఎవరూ అపోహలు వద్దని ఆయన తెలిపారు. ఆ పార్టీ కార్యాలయం ఎవరైతే లీజుకు ఇచ్చారో అతను అమెరికా లో ఉంటారని, తన మిత్రుడనిచెప్పారు. జకీయ పార్టీకి కార్యాలయం అంటే ఎవరూ ముందుకు రారు..కానీ తన అభ్యర్థన మేరకు రెండు సంవత్సరాల లీజు కోసం 2017 లో ఆ స్థలం తీసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత దాంట్లోనే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టామన్నారు.కానీ గత ఏడాదిగా ఆ స్థలం తిరిగి ఇవ్వాలని, దాన్ని డెవలెప్‌మెంట్ కి ఇచ్చుకుంటామని స్థల యజమాని కొరటంతో ఆ విషయం గత ఏడాది రీజినల్ కో - ఆర్డినేటర్ మిథున్ రెడ్డికి చెప్పానని అన్నారు.
పార్టీ కార్యాలయం...
ఆయన ఎన్నికలకు మూడు నెలల ముందే స్థలం యజమానికి ఇచ్చేయాలని చెప్పారని, కానీ ఎన్నికల వేళ కార్యాలయం తీసేస్తే మంచి విధానం కాదు అని సమయం తీసుకోవటం జరిగిందని ఆళ్ల నాని తెలిపారు. 15రోజుల క్రితమే స్థలాన్ని యజమానికి హ్యాండోవర్ చేయమని పార్టీ నాయకులు నిర్ణయించటం జరిగిందన్నారు ఆళ్ల నాని. ఆగస్టు 1వ తేదీన స్థలాన్ని హ్యాండోవర్ చేసామన్నారు. ఆగస్టు 15 కార్యక్రమం నిర్వహణ కోసం స్థల యజమాని అనుమతి తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహించామని, అనంతరం ఆగస్టు 16 వ తేదిన స్థలాన్ని స్థల యజమాని పూర్తి స్థాయిలో హ్యాండోవర్ చేసుకున్నారని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, ప్రజలు నాయకులు గమనించాలి అని కోరుతున్నానని తెలిపారు. గెలుపు ఓటములకి అతీతంగా ఏలూరు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, తన రాజీనామా కేవలం వ్యక్తిగతం మాత్రమేనని ఆళ్ల నాని చెప్పారు.