YSRCP : రుషికొండపైన భవనం జగన్ ఆస్తి కాదు
విశాఖలోని రుషికొండ భవనాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాధ్ వివరణ ఇచ్చారు
విశాఖలోని రుషికొండ భవనాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాధ్ వివరణ ఇచ్చారు. అధికార పార్టీ రుషికొండ నిర్మాణాలపై చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ రుషికొండ భవనం ప్రభుత్వ ఆస్తి అని ఆయన అన్నారు. అది జగన్ మోహన్ రెడ్డి సొంత ఆస్తి కాదన్న విషయాన్ని గుర్తుచుకోవాలన్నారు. అలా చిత్రీకరించేందుకు టీడీపీ నేతలు ఎక్కువగా శ్రమిస్తున్నారన్న గుడివాడ అమర్‌నాధ్ తాము విశాఖ రాజధానిగా ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని చెప్పారు.
మా నినాదం అదే...
ఎవరి నినాదం వారిదని తెలిపారు. రాష్ట్రపతితో పాటు ప్రధాని వంటి వారు విశాఖకు వచ్చినప్పుడు అక్కడ ఉండేలా రుషికొండపై భవన నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఆ భవనమేమీ జగన్ సొంత ఆస్తి కాదన్నారు. రుషికొండ నిర్మాణాలపై ముగ్గురు ఐఏఎస్ లతో కమిటీ వేశారని, కమిటీ ఓకే చెప్పిన తర్వాతనే భవనాలను నిర్మించడం జరిగిందని గుడివాడ్ అమర్‌నాధ్ తెలిపారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు జగన్ పై బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు.