అది కమ్మ కుల ఉగ్రవాదుల యాత్ర
మరో రెండు వందల ఏళ్లయినా రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందదని మాజీ మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు
కమ్మ కుల ఉగ్రవాదులు గుడివాడలో తనకు వ్యతిరేకంగా తొడలు కొట్టి సవాల్ విసిరారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మరో రెండు వందల ఏళ్లయినా రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందదని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చెబుతున్నదంతా ట్రాష్ గా కొడాలి నాని కొట్టిపారేశారు. అమరావతి రైతుల ముసుగులో కొందరు చేస్తున్న ఆందోళనకు ప్రజల నుంచి మద్దతు లభించదని ఆయన అన్నారు.
తనను కుల బహిష్కరణ చేయడానికి....
తనను కుల బహిష్కరణ చేయడానికి ఓడిపోయిన పది మంది నేతలు గుడివాడలో సవాల్ చేస్తే ఏమీ కాదన్నారు. ఆ పది మంది కమ్మకులానికి చెందిన వారు తనను ఏమీ చేయలేరన్న ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీపై కూడా ఆయన స్పందించారు. రెండ సార్లు సీఎం అయిన కేసీఆర్ ప్రధాని కావాలనుకుంటున్నారేమో అని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కావచ్చని కొడాలి నాని అభిప్రాయపడ్డారు.