విశాఖలో అల్లర్లు జరిగితే ఎవరిది బాధ్యత?

మూడు రాజధానులకే వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు

Update: 2022-09-09 12:18 GMT

మూడు రాజధానులకే వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. పరిపాలన రాజధానిని విశాఖ తీసుకెళ్లడం తధ్యమన్నారు. వైజాగ్ పరిపాలన రాజధాని అయితే ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. విశాఖలో కేవలం పది వేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రానికి సంపద వస్తుందన్నారు. తమకు అమరావతి ఎంతో విశాఖ, కర్నూలు అంతేనని కొడాలి నాని అన్నారు. 23 సీట్లకే పరిమితమయినా చంద్రబాబుకు బుద్ధి రాాలేదన్నారు. 29 నియోజకవర్గాలున్న హైదరాబాద్ ఎక్కడ? 29 గ్రామాలున్న అమరావతి ఎక్కడ? ఆయన ప్రశ్నించారు.

మూడు రాజధానులు ఖాయం...
విశాఖ సిటీలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయన్నారు. విశాఖకు పరిపాలన రాజధానిని తీసుకెళ్లడం తథ్యమన్నారు. అమరావతిలో లక్ష కోట్లు ఖర్చు పెట్టినా అభివృద్ధి జరగదని అని అన్నారు. తమ సంకల్పాన్ని ఎవరూ ఆపలేరన్నారు. టెక్నికల్ గా తాము బిల్లును ఉపసంహరించుకున్నామని, అటువంటి అప్పుుడు పాదయాత్ర ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఆ ప్రాంతంపై దాడి చేయడానికి వెళుతున్నారా? అని ప్రశ్నించారు. అక్కడ అల్లర్లు జరిగితే ఆ మంటల్లో చంద్రబాబు చలి కాచుకుంటారన్నారు. వైసీపీ మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు.
కొంతమందికే లబ్ది చేకూర్చాలని...
అమరావతి లో ఉన్న కొంతమంది ప్రజలకే లబ్ది చేకూర్చాలని చంద్రబాబు ప్రయత్నయమన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడే అనుమతులు వస్తాయన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ముదగ్రడ పద్మనాభం కాపుల రిజర్వేషన్ కోసం కిర్లంపూడి నుంచి అమరావతి వరకూ పాదయాత్ర చేస్తానంటే అనుమతి ఇవ్వలేదన్నారు. కోర్టులు కూడా అనుమతివ్వవని చెప్పారు. చంద్రబాబు లాయర్లు మరి అంతగట్టివారేమోనని, ఏం మిస్టరీయోనని ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కు జగన్ సతీమణి భారతమ్మకు చంద్రబాబు పిడిగ్రీ తిన్న ఈ ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తుందన్నారు. తమకు ఢిల్లీకి వెళ్లి లిక్కర్ షాపులు అడుక్కోవాల్సిన ఖర్మ ఏంటని కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీ నేతలకే ఆ అవసరం ఉందన్నారు. 


Tags:    

Similar News