TDP : రైతులను జగన్ నిలువునా ముంచాడు
హామీలతో రైతుల్ని జగన్ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.;
హామీలతో రైతుల్ని జగన్ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రైతుల్ని ఓటు అడిగే అర్హత జగన్ కు లేదన్నారు. రైతులకు ఇస్తానన్న సున్నా వడ్డీ రుణాలు ఏమయ్యాయి జగన్ అంటూ ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. రైతులను వంచించిన జగన్ మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
సున్నా వడ్డీరుణాలు ఎక్కడ?
సున్నా వడ్డీ రుణాలపై గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైంది అని నిలదీశారు. ఐదేళ్లలో రైతులకు రూ.26 వేల కోట్లు ఎగ్గొట్టిన ఘనుడు జగన్అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం పధకం కూడా అందులో కేంద్ర ప్రభుత్వ వాటానే ఎక్కువగా ఉందన్న విషయాన్ని కప్పిపుచ్చుతూ జగన్ మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.