Undavalli : ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లి విశ్లేషణ ఏంటంటే?
ఢిల్లీకి చక్రం తిప్పి వచ్చే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని మాజీ పార్లమెంటు సభ్యుడు అరుణ్ కుమార్ అన్నారు.
ఢిల్లీకి చక్రం తిప్పి వచ్చే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని మాజీ పార్లమెంటు సభ్యుడు అరుణ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాుతూ ఏపీ ఫలితాలతోనే మోదీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు పై ఆధారపడాల్సి వచ్చిందన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుంటారని తాను భావిస్తున్నానని ఉండవల్లి అరుణ‌్ కుమార్ తెలిపారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన అన్నింటినీ సాధించుకునే దిశగా చంద్రబాబు ప్రయత్నించాలని ఉండవల్లి కోరారు.
పదేళ్ల పాటు...
పదేళ్లు ఇలాంటి అవకాశం దక్కలేదని, ఇలాంటి అరుదైన అవకాశం మరోసారి వచ్చేందుకు ఛాన్స్ లేదన్నారు ఉండవల్లి అరుణ‌్ కుమార్. ఏపీలో బీజేపీతో కలవకపోయినా టీడీపీ, జనసేన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ ముందుగానే ఈ రెండు పార్టీలతో పొత్తు కలుపుకుని మోదీకి మరో అవకాశం దక్కేందుకు కారణమయిందన్నారు. అమరావతి, పోలవరంతో పాటు విభజన సమస్యలన్నీ పరిష్కరించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింప చేసేలా ప్రయత్నించాలని ఆయన కోరారు.