జైలు నుంచి నందిగం విడుదల
గుంటూరు జైలు నుంచి మాజీ ఎంపీ నందిగం సురేష్ విడుదలయ్యారు.;

nandigam suresh bail petition
గుంటూరు జైలు నుంచి మాజీ ఎంపీ నందిగం సురేష్ విడుదలయ్యారు. ఒక హత్య కేసులో నందిగం సురేష్ గత కొంతకాలంగా జైలులో ఉన్నారు. ఆయనకు బెయిల్ లభించడంతో ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. మరియమ్మ హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ దాదాపు ఐదు నెలల నుంచి జైలులోనే ఉన్నారు.
బెయిల్ రావడంతో...
నందిగం సురేష్ అనేక సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కానీ నిన్న బెయిల్ రావడంతో నందిగం సురేష్ 145 రోజుల తర్వాత విడుదలయ్యారు. అయితే గత కొంతకాలంగా నందిగం సురేష్ కాలర్ బోన్ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి నందిగం సురేష్ చేరుకున్నారు.