ఏలేరు వరదలకు కారణం జగన్ అసమర్థత.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే..

ఏలేరు వరదలకు కారణం జగన్ అసమర్థత.. ఏలేరు వరదలు సంబంధించి ప్రశ్నలు గుప్పించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే..!! వర్మ

Update: 2024-09-14 13:00 GMT

ఏలేరు వరదలకు కారణం జగన్ అసమర్థత.. ఏలేరు వరదలు సంబంధించి ప్రశ్నలు గుప్పించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే..!! వర్మ ,పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ తరపున 2009 లో రాజకీయ ప్రవేశం చేసి ఓడిపోయి, 2014 లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు..!!

ఈ మధ్య వర్మ గారి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది... కారణం...!!?? ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం,అక్కడి నుంచి కూటమి తరపున జనసేన పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్, పోటీ చేయడం,పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు,ఆయన కాడర్ మొత్తం సహకరించేలా చేయడం,వెరసి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజారిటీతో గెలవటానికి వర్మ గారి పాత్ర అనిర్వచనీయం...!!!

వర్మ గారు నిన్న శుక్రవారం నాడు ప్రెస్ మీట్ పెట్టి మరీ....జగన్ మోహన్ రెడ్డి గారిపై గుక్క తిప్పుకోకుండా... ఘాటుగా ప్రశ్నలు సంధించారు..!! బహుశా,వర్మ గారు వేసిన ప్రశ్నలకు జగన్ గారి దగ్గర సమాధానాలు కూడా ఉండవేమో...!!ఈ సమావేశంలో,వర్మ గారు మీడియాతో మాట్లాడుతూ... ఏలూరు వరదలకు అసలు కారణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ గారేనని తేల్చి చెప్పేసారు...!!

కాకినాడ పర్యటనలో భాగంగా, ఏలేరు వరద ముంపునకు గురైన పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన జగన్, పరామర్శ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ... మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాటి చంద్రబాబు ప్రభుత్వం, ఏలేరు ఆధునీకరణకు కేటాయించిన నిధుల విడుదలకు రివర్స్ టెండరింగ్ పేరుచెప్పి జాప్యం చేయడం వల్లే.. ఏలేరు వరదలు ముంచుకొచ్చాయని.., ఏలేరు వరదలకు మీ నిర్లక్ష్యమే కారణమని అడగ్గా....దానికి సమాధానంగా జగన్ మాట్లాడుతూ...."" 2019 లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి... ఏలేరు ఆధునీకరణకు నాటి చంద్రబాబు ప్రభుత్వం 295 కోట్లను మంజూరు చేసింది...ఆ పనుల కోసం చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన నిధుల వినియోగీకరణ జరుగుతూ ఉంది.

మా హయాంలో దాని వేగం ఎందుకు పెంచుకోలేక పోయాం అంటే... నిండుగా రిజర్వాయర్లు ఉన్నయ్..మోడలైజేషన్ ఆఫ్ కెనాల్ చేయాలి అంటే... క్రాప్ హాలిడే ప్రకటించాలి.. నిండు కుండలా రిజర్వాయర్లు ఉన్నప్పుడు ఎందుకులే క్రాప్ హాలిడే ప్రకటించడం అని...14 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించే కెనాల్ లో.... కనీసం 10 వేల క్యూసెక్కుల నీరు అయిన ప్రవహిస్తుంది కదా ...పెద్ద నష్టమేమీ లేదులే...రెగ్యులేట్ చేసుకుంటూ పోతా ఉంటే..కరువో..ఇంకోటో ఏదైనా వచ్చినప్పుడు దీని గురించి హాండిల్ చేయొచ్చులే అని..మా హయాంలో వేగవంతం చేయలేదు అని చెప్పారు..!!!

దీనికి కౌంటర్ గా వివరణ ఇస్తూ...వర్మ గారు...

""""అధికారం పోయాక ఇవాళ నువు వచ్చి కథలు చెప్పకు ప్రజలకు... ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి డాన్సులాడావ్...

ఇప్పుడు ఏలేరు వచ్చి... టెండర్లు పిలవలేదు, కనీసం ఎస్టిమేషన్ వేయించలేదు... నేను ఉన్నప్పుడు నిండుకుండలాగ ఉంది ఏలేరు అంటున్నావ్..!!

ఆరోజు ఏలేరులో ఉంది 7 టీఎంసీలే... ఎనిమిదో టీఎంసీ, తొమ్మిదో టీఎంసీ స్టీల్ ప్లాంట్ కి పోతే... మాకు మిగిలేది రెండు టీఎంసీ లే..!!అది సరిపోదు అన్నట్లు.. అందులోంచి తునికి దారాదత్తం చేసావ్ 600 కోట్లు పెట్టి..!!

తాండూరు రిజర్వాయర్ కి లిఫ్టింగ్ చేసి,మా నోట్లో మట్టి కొట్టావ్..!!! అందుచేత ఈరోజు వరదలు రావటానికి కారణం.. ఈవేళ పిఠాపురం నష్టపోవటానికి కారణం జగన్ మోహన్ రెడ్డి అసమర్థత..!!

ఇవాళ నేను అడుగుతావున్నా.... నీకు కానీ,నీ ఎంపీకి గానీ,నీ ఎమ్మెల్యేకి గానీ సిగ్గు,శరం ఉంటే .... కాపు నేస్తానికి వచ్చినప్పుడు ప్రకటించిన 160 కోట్లు ఎందుకు ఇవ్వలేదు...!!!

టెండర్ పిలిచావా...!!??

ఎస్టిమేషన్ వేయించావా....!!???

ఎందుకయ్యా నాటకాలు...!!??

చంద్రబాబు వల్ల పిఠాపురానికి ఏ రోజూ నష్టం జరగలేదు...అన్ని రకాలుగా పిఠాపురాన్ని ఆదుకున్నాడు...!!!ఇరిగేషన్ కి పిఠాపురానికి 2200 కోట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు...!! పుష్కర ఎత్తిపోతల పథకం , రాష్ట్రంలో ఉన్న అన్ని ఎత్తిపోతల పథకాలు ప్రారంబించి ముందుకు తీసుకెళ్ళింది చంద్రబాబు..!!పోలవరం 70 శాతం పూర్తి చేసింది చంద్రబాబే..!! నువ్వు,ఆ అంబటి రాంబాబు ఇద్దరూ కలిసి డయాఫ్రామ్ వాల్ ఇరగ్గొట్టి... వరదలు వచ్చేలా చేసారు మీరు అని... ఆగ్రహం వ్యక్తం చేశారు...!!

రైతులకు సంబంధించి చంద్రబాబు 196 కోట్ల పనులు మొదలు పెడితే... రివర్స్ టెండరింగ్ పేరుచెప్పి రద్దు చేశావ్...!!!

జగన్ అంటున్నాడు నిండుకుండలాగ ఏలేరు ఉంది... క్రాప్ హాలిడే ఇవ్వాలని ..!!?? సంవత్సరానికి ఆరు నెలలు ఖళీ... ఐదు సంవత్సరాలకు గాను 30 నెలలు ఖాళీ...కనీసం నువు టెండర్ పిలిచావా... ఏలేరు ఫేజ్ -2 రద్దు చేశావ్.. టెండర్ పిలిచావా..!!?? కనీసం ఎస్టిమేషన్ వేయించావా అంటే....అదీ లేదు...!!??

అసలు నీకు బుర్ర ఉందా...!!?? సంవత్సరానికి ఆరు నెలలు, ఐదు సంవత్సరాలకు 30 నెలలు ఖాళీ ఉండే ఏలేరు కి క్రాప్ హాలిడే ఎందుకు...!!??

అని జగన్ కి ప్రశ్నల వర్షం కురిపించారు..!!

Tags:    

Similar News