క్రూయిజ్ లో ప్రయాణించాలనుకుంటున్నారా? మీకు గుడ్ న్యూస్

సముద్రంలో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్. విశాఖ నుంచి క్రూయిజ్‌ నౌక చెన్నై బయలుదేరనుంది;

Update: 2025-03-07 03:55 GMT
cruise ship, visakhapatnam, chennai, good news
  • whatsapp icon

సముద్రంలో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్. ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పర్యాటకుల కోసం చెన్నై- విశాఖ- పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్‌ నౌకను నడపనున్నారు. మూడు సర్వీసుల్లో భాగంగా తొలిసారి జూన్‌ 30న చెన్నైలో బయలుదేరి జులై 2కు విశాఖ చేరుతుందని నిర్వాహకులు తెలిపారు. జులై 2న విశాఖలో బయలుదేరి 4న పుదుచ్చేరి వెళ్తుందని, తిరిగి 4న పుదుచ్చేరిలో బయలుదేరి 5న చెన్నైకి చేరుతుందని చెప్పారు.

విశాఖ టు చెన్నై...
రెండో సర్వీసుగా జులై 7వన చెన్నైలో బయలుదేరి 9న విశాఖపట్నానికి చేరుకుటుందని, 11న పుదుచ్చేరి, అక్కడ నుంచి 12న చెన్నైకి వెళ్తుందని తెలిపారు. మూడో సర్వీసుగా జులై 14న చెన్నైలో బయలుదేరి 16న విశాఖకు చేరుకుని, అక్కడ నుంచి 18న పుదుచ్చేరి చేరుకుని, 19వ తేదీకి చెన్నైకి చేరుతుందని ట్రావెల్‌ ఏజెంట్ల సమావేశంలో నిర్వాహకులు తెలిపారు.


Tags:    

Similar News