వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చేదెప్పుడంటే?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటీషన్ ను సీఐడీ కోర్టు కొట్టివేసింది;

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటీషన్ ను సీఐడీ కోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ేసులో తనకు బెయిల్ ఇప్పించాలంటూ వల్లభనేని వంశీ సీఐడీ కోర్టులో బెయిల్ పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన సీఐడీ కోర్టు బెయిల్ పిటీషన్ ను కొట్టివేయడంతో ఆయన జైలులో ఉండక తప్పేలా కనిపించడం లేదు.
నలుగురి పిటీషన్ కూడా...
బెయిల్ పిటీషన్ కొట్టివేస్తూ సీఐడీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వంశీతో పాటు ఈ కేసులో మరో నిందితులు నలుగురి బెయిల్ పిటీషన్ ను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్టయి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి.