నేడు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఆందోళనకు దిగుతామని హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది

Update: 2024-02-23 04:47 GMT

ఉద్యోగ సంఘాలతో నేడు ప్రభుత్వం చర్చలు జరపనుంది. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగుతామని హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది. మరికాసేపట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. తమకు పీఆర్‌సీతో పాటు పెండింగ్‌ డీఏలు ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పాటు సరెండర్ లీవ్‌లు,, పింఛను బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.

తమ డిమాండ్ల సాధన కోసం...
పన్నెండో పీఆర్సీ ప్రతిపాదనలను కూడా స్వీకరించకపోవడంతో మధ్యంతర భృతిని చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీ ఎన్జీవోలు ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశాయి. ఈనెల 27వ తేదీన చలో విజయవాడ కు పిలుపు నిచ్చారు. అయితే చలో విజయవాడకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈరోజు జరిగే చర్చల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News