Andhra Pradesh : ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇక వాటిని ఇక్కడే తీసుకోవచ్చట

ఆంధప్రదేశ్ లో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2024-06-18 03:43 GMT

ఆంధప్రదేశ్ లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెల్ల రేషన్ కార్డులున్న వారికి ఇకపై బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు కూడా ఇవ్వనున్నారు. జులై నెల నుంచి రేషన్ దుకాణాల్లో ఏపీ అంతటా కందిపప్పు, చక్కెర బియ్యంతో పాటు ఇవ్వనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు ఆయిల్ పాకెట్లను కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ మార్కెట్ లో కందిపప్పు, నూనె, పంచదార ధరలు పెరగడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

సరసమైన ధరలకు...
తెల్ల రేషన్ కార్డు దారులకు సరసమైన ధరలకు కందిపప్పు, ఆయిల్ పాకెట్లు, పంచదారను బియ్యంతో పాటు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు పౌరసరఫరాల శాఖకు ఈ మేరకు స్పష్టమైన ఆదేవాలు జారీ చేశారు. గత ప్రభుత్వం కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి కందిపప్పు ఇవ్వడం మానేసింది. అయితే ఇకపై కందిపప్పు తో పాటు ఆయిల్ పాకెట్లు, పంచదారను కూడా ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.
రేషన్ షాపుల్లో...
ఈ మేరకు ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా కందిపప్పు కొనుగోలు చేస్తుంది. నాణ్యత కలిగిన వస్తువులను సరసమైన ధరలకు పౌరసరఫరాల కేంద్రాల ద్వారా అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు వాటిని కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు చేరుకున్నాయి. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం ద్వారా తక్కువ ధరలకు తెలుపు రంగు కార్డు దారులకు పంపిణీ చేయవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. జులై ఒకటోతేదీ నుంచి అన్నిరేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు, పంచదారను కూడా ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.


Tags:    

Similar News