Andhra Pradesh : ఏపీకి మరో రెండు రోజులు రెయిన్ అలెర్ట్.. బంగాళాఖాతంలో మరో రెండు తుపాన్లు?

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది, మరో తుపాను ముప్పు పొంచి ఉంది

Update: 2024-10-07 03:39 GMT

Andhra pradesh weather updates

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మోస్తరు వర్షాలు పడే ప్రాంతాలు కూడా ఉన్నాయని వాతావవరణ శాఖ తెలపింది. ఈరోజు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల పడే అవకాశముందని తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.

ఈ ప్రభావంతో...
నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, సరిహద్దు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకూ ఉతర్త కేరళ, కర్ణాటక ద్వారా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు లేదా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈరోజు ఎక్కడక్కడంటే?
సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు అనేక చోట్ల పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని, కొన్ని చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని తెలిపింది
బంగాళాఖాతంలో రెండు...
బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశముందని హెచ్చరించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అప్రమత్తం చేసింది. ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Tags:    

Similar News