Weather Report : ఏపీలో నేడు వర్షాలు ఎక్కడెక్కడంటే?
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తమిళనాడులో కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. ఇది ఈ నెల 22 నాటికి మరింత బలపడి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశముందని తెలిపింది. 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశముందని కూడా పేర్కొంది.
ఈ జిల్లాల్లో...
ఈ ప్రభావంతో నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అంటే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ వర్షాలు పడతాయని తెలిపింది. పిడుగులు కూడా పడే అవకాశముందని తెలిపింది. ఈదురుగాలులు కూడా బలంగా వీచే అవకాశముందని పేర్కొంది. పొలాల్లో అందరూ చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.