Andhra Pradesh : నేడు ఏపీలో పిడుగులు పడేది ఎక్కడంటే?
ఆంధ్రప్రదేశ్ లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్ లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు, రేపు కూడా వర్షాలు పడతాయని పేర్కొంది. అనేక చోట్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. గంటకు ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలియజెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని తెలిపింది.
ఈ జిల్లాల్లో...
ద్రోణి తూర్పు విదర్భ వరకూ విస్తరించి ఉందని, ఈకారణంతో వర్షాలు పడతాయని తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరికొన్నిజిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపింది. పిడుగులు పడే అవకాశముండటంతో రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కిందకు వెళ్లవద్దని సూచించింది. రేపు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.