ఏపీకి ప్రభాస్ భారీ విరాళం.. ఎంతో తెలుసా?

సినీ హీరో ప్రభాస్ ఏపీ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.;

Update: 2021-12-07 06:31 GMT
prabhas, one crore, ap cm relief fund, flood victims
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన భారీ వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అయితే ఏపీని ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకు వచ్చింది. ఇప్పటికే అగ్ర హీరోలు అందరూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. తాజాగా సినీ హీరో ప్రభాస్ ఏపీ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఇతర హీరోల కంటే?
ప్రభాస్ కోటి రూపాయల విరాళం ప్రకటించి అత్యధికంగా టాలీవుడ్ హీరోలలో అగ్రజాబితాలో చేరారు. చిరంజీవి, రామ్ చరణ్ ఇరవై అయిదు లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ ఇరవై ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించారు. మహేష్ బాబు యాభై లక్షలు ప్రకటించారు. ప్రభాస్ కోటి రూపాయలు ప్రకటించి అందరికంటే ముందు వరసలో ఉన్నారు.


Tags:    

Similar News