Breaking: ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్ చిట్
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమెకు పెద్ద ఊరట లభించింది;
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమెకు పెద్ద ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కేసు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు.
చీఫ్ సెక్రటరీగా...
ప్రస్తుతం శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. కేసును హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. చీఫ్ సెక్రటరీగా నియమించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి.