ఏపీలో రూటు మార్చిన ప్రభుత్వం.. మద్యం దుకాణాలకు వెళితే?

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మద్యం దుకాణాలలో కొత్త నిర్ణయం తీసుకుంది

Update: 2024-05-28 02:26 GMT

liquor shops in AP

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మద్యం దుకాణాలలో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై నగదును మద్యం దుకాణాల్లో తీసుకోవద్దని ఎక్సైజ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఇకపై మద్యం దుకాణాల్లో డిజిటిల్ చెల్లింపుల ద్వారానే మద్యాన్ని విక్రయించాలని నిర్ణయించింది. మొన్నటి వరకూ కేవలం నగదు ఉంటేనే మద్యాన్ని విక్రయించేవారు. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రం డిజిటిల్ చెల్లింపులకు మాత్రమే అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐదు గంటల వరకూ మాత్రమే...
ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ చేపట్టే మద్యం విక్రయాలకు డిజిటల్ చెల్లింపుల ద్వారానే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత మాత్రం నగదును తీసుకునే వెసులు బాటు కల్పించింది. దీంతో పాటు మద్యం విక్రయాలను కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే డిజిటల్ రూపంలో మద్యాన్ని కొనుగోలు చేస్తే అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి రావడంతో కొనుగోలు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News