ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. లిఖితపూర్వకంగా ప్రభుత్వం ఆహ్వానం పంపారు.;

Update: 2022-01-31 14:45 GMT
prc, prc sadhana samithi, utp, aptf, andhra pradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. లిఖితపూర్వకంగా ప్రభుత్వం ఆహ్వానం పంపారు. ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు రావాల్సిందిగా అధికారికంగా ఆహ్వానం పంపింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మంత్రుల కమిటీతో చర్చలు ఉంటాయని జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ పంపారు.

రేపు మధ్యాహ్నం 12 గంటలకు...
స్టీరింగ్ కమిటీలో ఇరవై మందికి ఆహ్వానం పంపారు. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు ఉంటాయని ఆ ఆహ్వానంలో పేర్కొన్నారు. ఈరోజు పీఆర్సీ సాధన సమితి సమావేశమై తమకు ప్రభుత్వం నుంచి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానం అందలేదని, ఆహ్వానం అందితే వస్తామని తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం చర్చలకు ఆహ్వనించింది. మరి రేపు మంత్రుల కమిటీతో చర్చలకు ఉద్యోగ సంఘాలు వెళతాయా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News