YSRCP : వైసీపీకి భారీ షాక్.. 21 మంది నేతలు జంప్
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకూ బలంగా ఉన్న వైసీపీకి గట్టి దెబ్బతగలనుంది;
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన వెంటనే స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా అధికార పార్టీవైపు జంప్ అవుతున్నారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకూ బలంగా ఉన్న వైసీపీకి గట్టి దెబ్బతగలనుంది. వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు. దీంతో మేయర్ పదవి కూడా వైసీపీ నుంచి చేజారిపోనుంది.
బుజ్జగించినా...
వైసీపీ కార్పొరేటర్లలు 12 మంది టీడీపీ లోకి వెళ్లనున్నారని తెలిసింది. తొమ్మిది మంది జనసేనలో చేరడానికి రెడీ అవుతున్నారు. రేపు ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి అమర్‌నాధ్ ఎంత బుజ్జగించినా కార్పొరేటర్లు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. నిన్న మేయర్ ఛాంబర్లో నిర్వహించిన సమావేశానికి 25 మంది కార్పొరేటర్లు గైర్హాజరు కావడంతో వారు టీడీపీ, జనసేనలో చేరిక ఖరరాయిందని తెలిసింది. విశాఖపట్నం శివారులోని ఒక రిసార్ట్ లో పార్టీ మారనున్న కార్పొరేటర్ల కీలక సమావేశం నిర్వహించారు. దీంతో వైసీపీకి విశాఖలో భారీ షాక్ తగలనుంది.