Mudragada : ముద్రగడ వైసీపీలో చేరిక వాయిదా
వైఎస్సార్ కాంగ్రెస్ లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరిక వాయిదా పడింది.
వైఎస్సార్ కాంగ్రెస్ లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరిక వాయిదా పడింది. ఆయన ఈ నెల 15 లేదా 16 తేదీల్లో పార్టీలో చేరే అవకాశముంది. నిజానికి ముద్రగడ పద్మనాభం ఈ నెల 14వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని ప్రకటించారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి పదివేల మందితో ర్యాలీగా రావాలని కూడా నిర్ణయించారు. ఎవరి భోజనం వాళ్లే తెచ్చుకోవాలని, వాహనాలు కూడా సొంతంగానే సమకూర్చుకోవాలని ఆయన ఇటీవల తన అభిమానులకు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ర్యాలీకి అనుమతి నో...
అయితే కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీకి పోలీసులు అనుమతించలేదు. భద్రత కారణాల దృష్ట్యా ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ముద్రగడ కేవలం తన కుటుంబ సభ్యులతోనే కలసి వచ్చి తాడేపల్లిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరతారని చెబుతున్నారు. 14వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనలో ఉండటం కూడా ముద్రగడ చేరిక వాయిదా పడటానికి ఒక కారణమని అంటున్నారు. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో ఆయన పార్టీలో చేరే అవకాశముంది.