ఐదుగురు డిప్యూటీలు వీరేనా?
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి నుంచి సామాజిక సమీకరణాలను ఖచ్చితంగా పాటిస్తున్నారు
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి నుంచి సామాజిక సమీకరణాలను ఖచ్చితంగా పాటిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. గత కేబినెట్ లోనూ జగన్ ఐదుగురికి ఉపముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. వీరిలో మైనారిటీ, ఎస్సీ, కాపు, ఎస్టీ, బీసీలను ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేశారు. అదే సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగిస్తారని చెబుతున్నారు.
ఛాన్సెస్ వీరికే.....
అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎంలుగా మైనారిటీ లనుంచి అంజాద్ భాషా తిరిగి డిప్యూటీ సీఎం కానున్నారు. అలాగే ఎస్టీ నుంచి పీడిక రాజన్న దొరకు, ఎస్సీ నుంచి నారాయణస్వామి లేదా పినెపి విశ్వరూప్ లేదా తానేటి వనిత,, బీసీల నుంచి ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, కాపు సామాజికవర్గం నుంచి అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజాలలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశముంది.