ఉదారంగా వ్యవహరించండి.. పరిహారం చెల్లించండి

నెల్లూరులో మృతి చెందిన కానస్టేబుల్, గ్రామ సచివాలయ ఉద్యోగి, ఆర్టీసీ కండక్టర్ కుటుంబాలకు చెరి ఇరవై ఐదు లక్షల నష్ట పరిహారం చెల్లించాలని జగన్ ఆదేశించారు.

Update: 2021-11-22 05:59 GMT

రాష్ట్రంలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరద బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని కోరారు. వరద బాధితులకు ఉచితంగా ఇరవై ఐదు కేజీల బియ్యం, రెండువేల నగదును ఇవ్వాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు. పాక్షింగా ఇళ్లు కోల్పోయిన వారికి 5,200 నగదు ఇవ్వాలని, పూర్తిగా ధ్వంసమయితే 95,200లు ఇవ్వాలని, మరణించిన ప్రభుత్వోద్యోగులకు అండగా నిలవాలని కోరారు.

ఆ కుటుంబాలకు 25 లక్షలు...
నెల్లూరులో మృతి చెందిన కానస్టేబుల్, గ్రామ సచివాలయ ఉద్యోగి, ఆర్టీసీ కండక్టర్ కుటుంబాలకు చెరి ఇరవై ఐదు లక్షల నష్ట పరిహారం చెల్లించాలని జగన్ ఆదేశించారు. వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. సహాయక శిబిరాల్లో అన్ని వసతులను కల్పించాలని జగన్ అధికారులను ఆదేశించారు. బాధితులు ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చూడాలని, ఎలాంటి ఫిర్యాుదులు అందకూడదని జగన్ అధికారులను ఆదేశించారు.


Tags:    

Similar News