సీఎం జగన్ పేరును ప్రస్తావించిన సీబీఐ
వివేకా హత్య కేసులో విచారణకు అవినాశ్ రెడ్డి సహకరించడం లేదని సీబీఐ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన విచారణలో
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించింది. ఈ కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి విచారణను ఎదుర్కొంటుండగా.. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరును సీబీఐ ప్రస్తావించింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి జగన్ పేరు ప్రస్తావించడాన్ని జగన్ తరపు న్యాయవాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కావాలని కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిల్ లో సీబీఐ సంచలన విషయాలను ప్రస్తావించింది. అఫిడవిట్ లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరుని ప్రస్తావించింది. వివేకా హత్య విషయం సీఎం జగన్ కు ఉదయం 6: 15 గంటలకే తెలిసినట్లు దర్యాఫ్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి హత్య విషయాన్ని బయట పెట్టకముందే జగన్ కు తెలుసని కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది. అయితే వివేకా హత్య విషయాన్ని జగన్ కు ఎవరు చెప్పారని విషయం దర్యాప్తు చేయాల్సి ఉంది.