వైసీపీపై విమర్శలు ఉండవు : జనసేనట
విశాఖలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతాని కంటే భిన్నంగా స్పందించారు
విశాఖలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతాని కంటే భిన్నంగా స్పందించారు. విశాఖ నగరానికి వస్తున్న వారందరికీ జనసేన స్వాగతం తెలిపారు. తమ రాష్ట్రానికి చెందిన శక్తివంతమైన అనుభవం కలిగిన యువత మెప్పించగలరని భావిస్తున్నానని తెిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్, రాష్ట్ర యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడంతో పాటు ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నానని ాయన తెలిపారు. ఈ సమ్మిట్ ఆలోచనలు కేవలం విశాఖకే పరిమితం చేయకుండా తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లో అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించాలని కోరారు.
సమ్మిట్ ను అందరికీ...
దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్ లాగా మార్చాలని పవన్ కల్యాణ్ కోరారు. రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదని తెలిపారు. ఇన్వెస్టర్ల సమ్మిట్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయమని పవన్ తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి సంపూర్ధ మద్దతును అందిస్తామని పేర్కొన్నారు.