నేను సీఎం కావాలని కలలు కనడం లేదు
తాను చట్టాలను గౌరవించేవాడినని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను కోడికత్తి డ్రామాలు ఆడబోనని తెలిపారు.
తాను చట్టాలను గౌరవించేవాడినని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను కోడికత్తి డ్రామాలు ఆడబోనని తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న అనంతరం పవన్ కల్యాణ్ జనసైనికులతో మాట్లాడారు. వారాహి ఏపీ రోడ్లమీద ఎలా తిరుగుతుందో చూస్తామంటున్నారని, తాను తిరిగి తీరుతానని తెలిపారు. ఒకచేయి సొంత కులం వైపు, మరొక చేయిని వేరే కులం వారికి చూపాలన్నారు. తప్పుడు పనులు చేసి, వేల కోట్లు కొట్టేసే తత్వం తనదు కాదన్నారు. ఏ తప్పు చేయని తనకు ఎంత ధైర్యం ఉంటుందో తెలుసుకోవన్నారు. అభివృద్ధి జరగాలంటే శాంతిభద్రతలు సక్రమంగా ఉండాలని పవన్ కల్యాన్ అభిప్రాయపడ్డారు.
ప్రజలు ఒప్పుకుంటేనే...
తన తాత, తండ్రి ఎవరూ ముఖ్యమంత్రులు కాలేదన్నారు. జగన్ టీనేజ్ లో ఉన్నప్పుడు జైల్లో ఒక ఎస్సైని కొట్టారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. బిడ్డల భవిష్యత్ ను పణంగా పెట్టి పార్టీని పెట్టానన్నారు. యువత ఇప్పుడు బయటకు రాకుంటే బానిసల్లాగా మారిపోతారన్నారు. తాను ఏపీ భవిష్యత్ కోసమే ఉంటానని తెలిపారు. ఆ వ్యూహం తనకు వదిలేయమని కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదోవపట్టించడం కాదన్నారు. తాను ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కనడం లేదని, ప్రజలు ఒప్పుకుంటే ముఖ్యమంత్రిని అవుతానని తెలిారు.