సీఎం జగన్ కు పవన్ లేఖ.. ఏం రాశారంటే?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. పింఛన్లు తొలగించడానికి ముందు నోటీసులు ఇచ్చామని చెబుతూ నోటీసులు ఇచ్చి నాలుగు లక్షల పింఛన్లను ఎందుకు తొలగించారని పవన్ కల్యాణ్ లేఖలో ప్రశ్నించారు. పింఛన్లను తొలగించడానికే నోటీసులు ఇచ్చారని పవన్ అభిప్రాయపడ్డారు. పింఛన్లను తొలగించడానికి కారణాలు సహేతుకంగా లేవని పవన్ కల్యాణ్ లేఖలో పేర్కొన్నారు.
ఆర్థిక దివాలాకోరుతనాన్ని...
అవ్వా, తాతలకు మూడు వేల రూపాయల పింఛను ఇస్తానన్న హామీ ఇలా అమలు చేస్తారా అని పవన్ ప్రశ్నించారు. జగన్ కు రాసిన లేఖలో పింఛన్లను తొలగించిన వారి పేర్లను పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పింఛను మొత్తాన్ని పెంచడానికి లబ్దిదారుల సంఖ్యను తగ్గిస్తారా అని లేఖలో నిలదీశారు. ఆర్థిక దివాలా కోరుతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పింఛన్లను తొలగిస్తారా? అని ప్రశ్నించారు. వెంటనే తొలగించిన పింఛన్లను తిరిగి మంజూరు చేయాలని పవన్ తన లేఖలో డిమాండ్ చేశారు.