అర్జంటుగా ఢిల్లీకి పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ కానున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. బీజేపీతో జనసేన మైత్రి కొనసాగుతుందా? లేదా? అన్న అనుమానం ఉన్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వబోనని పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో టీడీపీతో పాటు పొత్తు కుదుర్చుకునేందుకు ఆయన వెళ్లారా? లేదా రోడ్డు మ్యాప్ కోసం వెళ్లారా? అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణ రాజకీయాలపై కూడా చర్చించే అవకాశాలున్నాయి.
పొత్తులపైనా...
బీజేపీతో ఇప్పటికే పవన్ కల్యాణ్ పొత్తును కొనసాగిస్తున్నారు. తొలుత తెలంగాణ వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రెండు రాష్ట్రాల ఎన్నికలలో తమ పార్టీ విధానాన్ని బీజేపీ పెద్దలకు వివరించే అవకాశముందని తెలుస్తోంది. వైసీపీని ఓడించాలంటే విపక్షాలన్నీ ఐక్యత పాటించడం అవసరమని పవన్ భావించారు. అయితే పవన్ ఎవరెవరితో భేటీ అయి ఏ విషయంపై చర్చిస్తారన్నది తెలియాల్సి ఉంది. పవన్ కంటే ముందు పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ చేరుకున్నారు