పవన్ కల్యాణ్ వెహికల్ రిజిస్ట్రేషన్ తిరస్కరణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాహనం రిజిస్ట్రేషన్ ను ఆర్టీఏ అధికారులు అంగీకరించలేదు. దీంతో రిజిస్ట్రేషన్ వాయిదా పడింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాహనం రిజిస్ట్రేషన్ ను ఆర్టీఏ అధికారులు అంగీకరించలేదు. దీంతో రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. ఆర్టీఏ అధికారులు పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లారీ ఛాసిస్ ను బస్ గా మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బస్సు అని చెప్పినప్పుడు బస్సుకు ఉండాల్సిన హైట్కంటే ఎక్కువగా ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.
అనేక అభ్యంతరాలు....
ఆర్మీకి సంబంధించిన కలర్ ను ఎలా ఒక వాహనానికి ఉపయోగిస్తారని ఆర్టీఏ అధికారులు ప్రశ్నించారు. మైన్స్ లో వాడాల్సిన వాహన టైర్లను రోడ్డు మీద వినియోగించే వాహనానికి ఎలా వాడతారని అభ్యంతరం తెలిపారు. ఆర్మీకి సంబంధించిన వాహనాలకు వినియోగించే కలర్ ను ఒక సివిల్ వాహనానికి ఉపయోగిస్తారని ప్రశ్నించారు. ఇవన్నీ మార్చుకుని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయగలమని ఆర్టీఏ అధికారులు చెప్పడంతో జనసేనాని వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా పడింది.