నాలుగురోజుల్లో నాలుగు వేదికలు మార్చాం.. ప్రభుత్వ వత్తిడే
జనసేన ఆవిర్భావ సభను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు
జనసేన ఆవిర్భావ సభను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ నెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభను మంగళగిరిలో నిర్వహించుకోవాలనుకున్నామని చెప్పారు. సభ ఏర్పాటు కోసం మంగళిగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాన్ని ఎంపిక చేసుకున్నామనిచెపపారు. స్థలం ఇచ్చేందుకు రైతులు తొలుత ముందుకు వచ్చారని, అయితే ప్రభుత్వ వత్తిడితో వారు ఇప్పుడు వెనక్కు వెళుతున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు.
స్థలం ఇస్తామన్న రైతులపై.....
తాము స్థలం ఇవ్వలేమని, ఇబ్బందులుపడతామని రైతులు ఇప్పుడు చెబుతున్నారని ఆయన అన్నారు. సభా వేదిక, స్థలాన్ని వారం రోజుల్లో ఖరారు చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమిది అని నాదెండ్ల ఫైర్ అయ్యారు. సభ వేదిక స్థలం నాలుగు రోజుల్లో నాలుగుసార్లు మార్చాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దింపే విధంగా ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు.