Tirumala : టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలివే
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు;

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5258.68 కోట్ల రూపాయలతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలని నిర్ణయించింది. ఇతరదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కమిటీని ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించింది.
నిర్ణయాలివీ...
దీంతోపాటు సైన్స్ సిటీకి కేటాయించిన 20ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి డిసైడ్చేసింది. తిరుమలలో అనధికార హాకర్లపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆగమ సలహా మండలిపై టీటీడీ వేటు వేసింది. అలాగే 26 కోట్ల రూపాయల వ్యయంతో 1,500 గదులకు మరమ్మతులు చేయాలని నిర్ణయించింది. అయితే ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు తెలిపారు.