నాగబాబు నామినేషన్ వేళ?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు;

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా ఆయన ఎమ్మెల్సీ పదవికి ఆయన నామినేషన్ ను దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచిన మంత్రి నారా లోకేష్, పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజులు బలపర్చారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి టీడీపీ జనసేనకు కేటాయించింది.
కూటమి అభ్యర్థిగా...
ఈ ఒక్కస్థానానికి తన సోదరుడు నాగబాబును ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎంపిక చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు వస్తాయని ఆయన చెప్పారు. ఈరోజు రిటర్నింగ్ అధికారి వనితారాణి కి నామినేషన్ పత్రాలు కొణిదల నాగబాబు అందచేశారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పల్లాశ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.