గేట్లు గట్టివే.. బాగా పనిచేశాయ్
అతిపెద్దదైన పోలవరం ప్రాజెక్టుకు వరదతో పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా 15 లక్షల క్యూసెక్కుల కిందకు విడుదల చేస్తున్నారు.
అతిపెద్దదైన పోలవరం ప్రాజెక్టుకు వరదతో పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా 15 లక్షల క్యూసెక్కులు కిందకు విడుదల చేస్తున్నారు. అయితే కొత్త ప్రాజెక్టు కావడం, స్పిల్ వే వ్యవస్థ తొలి సీజన్ లోనే సమర్థవంతంగా పనిచేసిందని అధికారులు చెబుతున్నారు. అతి పెద్దవైన 48 హైడ్రాలిక్ గేట్లను తొలిసారి అతి తక్కువ సమయంలోనే వినియోగం లోకి వచ్చాయంటున్నారు. 48 గేట్లను ఎత్తివేసి కిందకు 15 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ వే ఛానల్ మీదుగా గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
వరద అకస్మాత్తుగా...
అకస్మాత్తుగా వచ్చిన వరదను నియంత్రించే విధంగా హైడ్రాలిక్ పద్ధతిలో ఈ ఈ గేట్లను ఏర్పాటు చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు కావడంతో 48 గేట్లు ఒకేసారి తెరుచుకుంటాయా? లేదా? అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ వాటి పనితీరు సమర్థంగా ఉందని తేలింది. ఆరు కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్, ఛానెల్ మీదాగా గోదావరికి వరద నీటిని మళ్లించడంలో ఈ గేట్ల పాత్ర కీలకంగా మారిందని అధికారులు చెబుతున్నారు.