ఉదయగిరిలో చిరుత పులి సంచారం.. హడలిపోతున్న ప్రజలు

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చిరుత పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది

Update: 2024-06-21 07:34 GMT

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చిరుత పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. మేకపాటి గౌతం రెడ్డి కళాశాల సమీపంలో గల అటవీశాఖ నర్సరీ పై భాగంలో చిరుత తిరిగినట్లు స్థానికులు గుర్తించారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నిన్న రాత్రి మేకల మంద నుంచి తప్పిపోయిన మేక పై చిరుత దాడి చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

అటవీ శాఖ అధికారులు...
సంఘటన స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని చిరుత పులి కాలిముద్రలు సేకరించారు. చిరుత సంచారం ఉందని గుర్తించిన అధికారులు ఈ ప్రాంతంలో ఒంటరిగా రాత్రి వేళ తిరగవద్దని, పెంపుడు జంతువులును వదలి పెట్టవద్దని ప్రజలను కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News