విజయనగరం జిల్లాలో చిరుత సంచారం
విజయనగరం జిల్లాలో చిరుతపులి సంచరిస్తుంది. వంగర మండలంలో పెద్దపులి జాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
విజయనగరం జిల్లాలో చిరుతపులి సంచరిస్తుంది. వంగర మండలంలో పెద్దపులి జాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇటీవల కాలంలో చిరుతలు, పెద్దపులులు అడవిని వీడి జనంలోకి వస్తున్నాయి. ఆహారం, నీటి కోసం మైదానం ప్రాంతానికి తరలి వస్తున్నాయి. దీంతో జనం భయం గుప్పిట్లో బెంబేలెత్తిపోతున్నారు.
వణికిస్తున్న చిరుత....
కాకినాడ, అనకాపల్లి జిల్లాలో చిరుత సంచారం అక్కడి ప్రజలను అనేక రోజుల పాటు వణికించింది. ఆవులు, గేదెలు చిరుత బారిన పడ్డాయి. ఇప్పుడు ఇది విజయనగరం జిల్లాకు వ్యాపించింది. అక్కడ చిరుత సంచారాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పులి జాడను పట్టుకునే చర్యలు ప్రారంభించారు.