Liqour Shops Close : మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్.. క్యూ కట్టిన మందుబాబులు

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. మూడు రోజుల పాటు మద్యం దొరకదు

Update: 2024-06-03 03:26 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. మూడు రోజుల పాటు మద్యం దొరకదు. దీంతో మందుబాబులు నిన్నటి నుంచే దుకాణాల వద్ద క్యూ కట్టి మూడు రోజులకు సరిపడా స్టాక్ ను కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. శాంతిభద్రతలను అదుపులో ఉంచాలని పోలీసులు మద్యం దుకాణాలను మూడు రోజుల పాటు క్లోజ్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ అధీనంలోనే నడుపుతుండటంతో నేటి నుంచి బంద్ కానున్నాయి.

నేటి నుంచి...
మూడు, నాలుగు, ఐదో తేదీల్లో మద్యం దుకాణాలు తెరవరు. బార్లలో కూడా మద్యం విక్రయాలను కట్టడి చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. బార్లలో మద్యం విక్రయించినట్లు తెలిస్తే లైసెన్సు రద్దు చేస్తామని పోలీసులతో పాటు ఎక్సైజ్ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇతర ప్రాంతాల నుంచి మద్యం సీపాలను తీసుకు వచ్చినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో నాలుక పిడచకట్టుకుపోకుండా ఉండేందుకు మందుబాబులు ముందుగానే ఫుల్ బాటిల్స్ ను కొనుగోలు చేస్తున్నారు.
మాల్స్ వద్ద...
మూడు రోజుల పాటు మద్యం దొరకదని భావించి మద్యం దుకాణాలకు క్యూ కట్టారు. ఎంతగా అంటే ధనిక, పేద అనే తేడా లేకుండా క్యూ కట్టారు. దీంతో మద్యం దుకాణాలన్నీ నిన్నటి నుంచే కిటికిటలాడుతున్నాయి. కాస్త డబ్బున్న వాళ్లు లిక్కర్ మాల్స్ కు వెళ్లి పెద్ద సంఖ్యలో బాటిల్స్ ను కొనుగోలు చేస్తున్నారు. ఇళ్లలోనే ఇక మందు దుకాణం పెట్టేందుకు నిర్ణయించుకోవడంతో మద్యం షాపుల వద్ద గిరాకీ పెరిగింది. పోలీసులు మాత్రం మద్యం తాగి రోడ్లపైకి వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


Tags:    

Similar News