టీటీడీకి మేఘా సంస్థ పది ఎలక్ట్రిక్ బస్సులు

ితిరుమల తిరుపతి దేవస్థానానికి మేఘా ఇంజినీరింగ్ కంపెనీ పది ఎలక్ట్రిక్ బస్సులను అందచేయనుంది.

Update: 2022-10-21 08:26 GMT

ితిరుమల తిరుపతి దేవస్థానానికి మేఘా ఇంజినీరింగ్ కంపెనీ పది ఎలక్ట్రిక్ బస్సులను అందచేయనుంది. తిరుమలలో భక్తుల కోసం వీటిని ఉపయోగించనున్నారు. ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ కు చెందిన బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేయనున్నట్లు తెలిపింది. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఎండీ పీవీ కృష్ణారెడ్డి ఈ మేరకు లేఖ రాశారు. దీంతో ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఛైర్మన్ కవే ప్రదీప్ ఈరోజు టీటీడీ ఛైర్మన్ తో సమావేశమై ఈ లేఖను అందించారు.

పర్యావరణ....
పది ఏసీ బస్సులను టీటీడీకి అందజేయనున్నట్లు తెలిపారు. తిరుమలలో భక్తులను ఒకచోట నుంచి మరొక చోటకు చేర్చేందుకు ఈ బస్సులను వినియోగించనున్నారు. ఈ బస్సులో మొత్తం 36 మంది ప్రయాణించవచ్చు. ఎమెర్జెన్సీ బటన్, ప్రతి సీటుకు యూఎస్‌బీ సాకెట్ ఉంటుందని వివరించార. లీథియం ఐయాన్ బ్యాటరీలతో ఈ బస్సులు నడవనున్నాయి. ఒక్కసారి ఛార్జి చేస్తే 180 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. బ్యాటరీ మూడు గంటల్లో పూర్తిగా ఛార్జి అవుతుంది. తిరుమల కొండపై పర్యావరణ పరిరక్షణకు ఈ బస్సులు ఉపయోగపడతాయని తెలిపారు.


Tags:    

Similar News