YSRCP : వైసీపీకి మరో షాకింగ్.. కీలక నేత రాజీనామా?
వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం
వైసీపీకి మరో కీలక నేత రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. మరికొద్దిసేపట్లో ఆయన రాజీనామా ప్రకటన చేయనున్నారని తెలిసింది. 2014లో టీడీపీ నుంచి అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన అవంతి శ్రీనివాస్ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.
మంత్రివర్గంలో చేరి...
తర్వాత భీమిలీ నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించి జగన్ మంత్రివర్గంలో చేరారు. అయితే 2024లో వైసీపీ అధికారంలోకి రాకపోవడం దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాలకు అవంతి శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. అయితే వైసీపీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం జగన్ వ్యవహార శైలి నచ్చకనే అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.