Rain Alert : రాబోయే మూడు రోజులు వర్షాలే

ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2023-11-28 02:29 GMT

ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని పేర్కొంది.

తుపానుగా మారి...
రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని, దీనివల్ల రాబోయే మూడు రోజుల్లో ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవాకాశముందని తెలిపింది. మూడు రోజుల పాటు తేలిక, ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.


Tags:    

Similar News