‌High Alert : నేడు అక్కడ పిడుగులు పడతాయ్ .. బీ అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ లో నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది

Update: 2024-06-13 04:31 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అనేక జిల్లాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో అనేక చోట్ల వర్షాలు పడటమే కాకుండా పిడుగులు పడే అవకాశముందని తెలిపింద.ి ఈరోజు అక్కడక్కడ పిడుగులు పడతాయని, వ్యవసాయదారులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ ప్రాంతాల్లో...
ఈరోజు ఆంధ్రపద్రవేశ్ లోని విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ ఏపీ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది.


Tags:    

Similar News