Andhra Pradesh : ఏపీకి తుపాను ముప్పు లేనట్లేనట
ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వాయవ్య దిశగా పయనిస్తుందని తెలిపారు. అయితే ఇది తుపానుగా మారుతుందా? లేదా? అన్నది వాతావరణ శాఖ చెప్పకపోయినా, ఒకవేళ తుపానుగా ఏర్పడినా రాష్ట్రంపై ప్రభావం చూపకపోవచ్చని అధికారులు తెలిపారు.
వాయవ్య దిశగా...
నైరుతి రుతుపవనాల సమయంలో ఏర్పడిన తొలి అల్పపీడనం కావడంతో వాయవ్య బంగళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వాయవ్య దిశగా పయనియస్తాయని చెబుతున్నారు. ఇది ఒడిశా, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ వైపు వెళతారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కానీ ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు వర్సాలు కురుస్తాయని తెలిపింది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశముందని,గంటలకు నలభై నుంచి యాభై కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.