Ambati : ఎవరొచ్చినా వైసీపీ గెలుపును ఆపలేరు
మూడు పార్టీలు కలసి పోటీ చేసినా జగన్ ను ఓడించలేవని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
మూడు పార్టీలు కలసి పోటీ చేసినా జగన్ ను ఓడించలేవని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజాగళం సభలో మైకు మూగబోతే దానికి పోలీసులు కారణమని సాకులు చెబుతున్నారన్నారు. ప్రజాగళం సభ తర్వాత చంద్రబాబులో అభద్రతాభావం ఏర్పడిందన్నారు. ప్రజాగళం సభ ఏం సందేశమిచ్చిందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రజాగళం సభలో ఛైర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయన్న అంబటి మైకు కూడా సరిచేసుకోలేని పార్టీలు రాష్ట్రాన్ని ఎలా నడుపుతాయని ప్రశ్నించారు.
ఆ సభ అట్టర్ ప్లాప్...
మూడు పార్టీల సభ అట్టర్ ప్లాప్ అయిందన్నారు. జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. చంద్రబాబు తన రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతోనే నడిచిందన్నారు. ఉమ్మడి సభకు జనం రావడం లేదన్నారు. సిద్ధం సభలు సక్సెస్ కావడం చూసిన తర్వాత కూడా టీడీపీ నేతలు సభల నిర్వహణ ఎలా? అన్నది నేర్చుకోలేదన్నారు. చంద్రబాబులో గెలవలేని నిరుత్సాహంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పై కొన్ని మీడియా సంస్థల చేత బురద జల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు.