పాలిటిక్స్ లో పవన్ జోకర్
జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మకమైన మార్పులను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు
జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మకమైన మార్పులను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మార్పును సహించలేని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లను క్రిమినల్స్ గా చిత్రీకరించం తగదన్నారు. వారు క్రిమినల్స్ కాదని, దోపిడీదారులు అంతకన్నా కాదన్నారు. ప్రజల చెంతకు పాలనను చేర్చడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ అని అంబటి అన్నారు. ఆ వ్యవస్థ మీద విషం కక్కుతున్నారని అంబటి రాంబాబు మండి పడ్డారు.
ఇంత విషం చిమ్మడం ఎందుకో?
వాలంటీర్లు తప్పు చేస్తే ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోచుకున్న విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని చంద్రబాబు తన మనసులో మాట బయటపెట్టారంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరగదని, వైసీపీ 175 నియోజకవర్గాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ నేతలు ప్రచారం కోసం వాహనాలను ఉపయోగిస్తారని, దానికంత ఆర్భాటం ఎందుకని పవన్ కల్యాణ్ ను అంబటి ప్రశ్నించారు. సినిమాల్లో పవన్ హీరో అని రాజకీయాల్లో జోకర్ అని అన్నారు.