ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని చంద్రబాబు?
మద్యపాన నిషేధం గురించి మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదని మంత్రి కొడాలి నాని అన్నారు.
మద్యపాన నిషేధం గురించి మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. సహజ మరణాలను కూడా అక్రమ మద్యం మరణాలుగా చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చి స్పీకర్ నిరాకరించడంతో ఆందోళనకు దిగింది. టీడీపీ సభలో నిబందనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని కొడాలి నాని అన్నారు. జంగారెడ్డిగూడెంలో ఎవరూ అక్రమ మద్యం తాగి మరణించలేదని చెప్పారు.
మద్యపాన నిషేధం ....
ఇక మద్యపాన నిషేధం గురించి టీడీపీకి మాట్లాడే హక్కే లేదన్నారు కొడాలి నాని, ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తే చంద్రబాబు దానిని తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారేలా చేయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే చంద్రబాబును ప్రజలు నమ్మరని అన్నారు. అధికారం నుంచి దిగిపోయే ముందు బార్లకు ఐదేళ్లు లైసెన్సు ఇచ్చింది చంద్రబాబేనని అన్నారు.