జేసీ ప్రభాకర్ రెడ్డి పై మంత్రి హాట్ కామెంట్స్

జేసీ ప్రభాకర్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-01-03 11:41 GMT

జేసీ ప్రభాకర్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వయసుకు తగినట్లు మాట్లాడటం లేదన్నారు. కూటమిలో మిత్ర పక్షంగా ఉన్న వారిపైనే అసభ్య పదజాలంతో దూషించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆయన బస్సులు తాడిపత్రిలో తగులపడితే దానికి కారణం బీజేపీ ఎందుకు అవుతుందని సత్యకుమార్ అన్నారు.

వయసు తగినట్లు...
అర్థం పర్ధం లేని మాట్లాడటం సరికాదని, జేసీ వయసుకు తగిన పని కాదని మంత్రి సత్యకుమార్ అన్నారు. తన వ్యక్తిగత విషయాలను తీసుకు వచ్చి రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తూ మాట్లాడటం తగదని హితవు పలికారు. అదే సమయంలో గతంలో జేసీ నిర్వహించే బస్సుల వ్యాపారాలపై అనేక ఆరోపణలు వచ్చిన విషయాలను ఈ సందర్భంగా సత్యకుమార్ గుర్తు చేశారు


Tags:    

Similar News