నేడు బాపట్లకు ఇద్దరు మంత్రులు
నేడు బాపట్లలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన చేయనున్నారు.
నేడు బాపట్లలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన చేయనున్నారు.మరో మంత్రి పార్థసారథితో కలిసి ధాన్యం కొనుగోళ్ల పై అధికారులతో గొట్టిపాటి సమీక్ష నిర్వహించనున్నారు. దీంతోపాటు కొల్లూరులో హౌసింగ్ లేఅవుట్ ను న్న ఇరువురు మంత్రులు పరిశీలించనున్నారు. అధికారులతో సమీక్షించి వారికి సూచనలు అందచేయనున్నారు.
చంద్రబాబు పర్యటన విషయంలో...
మరోవైపు ఈ నెల 7వ తేదీన చంద్రబాబు బాపట్లలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, పార్ధసారధిలు పరిశీలించనున్నారు. పోలీసు అధికారులతో మాట్లాడనున్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక నేతలతో కూడా చర్చించనున్నారు.