కృష్ణా నదిలో భారీగా బయటపడ్డ నాగ ప్రతిమలు

సాధారణంగా అక్కడ ఎప్పుడూ ప్రజలు సేద తీరుతూ ఉంటారు. కానీ ఎందుకో అక్కడికి వెళ్లి చూసిన వాళ్లకు ఓ రకమైన భయం మొదలైంది.

Update: 2023-06-26 03:08 GMT

సాధారణంగా అక్కడ ఎప్పుడూ ప్రజలు సేద తీరుతూ ఉంటారు. కానీ ఎందుకో అక్కడికి వెళ్లి చూసిన వాళ్లకు ఓ రకమైన భయం మొదలైంది. అందుకు కారణం నాగ ప్రతిమ.. ఆ ప్రాంతంలో ఎప్పుడూ చూడనన్ని నాగ ప్రతిమలు ఒక్కసారిగా కనపడడంతో అందరిలోనూ ఒకటే రకమైన ప్రశ్న. కృష్ణా నదిలో నాగ ప్రతిమలు బయటపడ్డాయా.. లేక ఎవరైనా వదిలేసి వెళ్లిపోయారా.. దీంతో స్థానికులను భయం వెంటాడుతూ ఉంది. కృష్ణా నది లోతులలో మరిన్ని విగ్రహాలు వుండే అవకాశం వున్నట్లు కూడా ప్రచారం మొదలైంది. ఏమి జరిగింది.. ఏమి జరుగుతోంది అనే కుతూహలం ప్రజలను వెంటాడుతూ ఉంది.

గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరాన నాగ ప్రతిమలు బయటపడ్డాయి. తాడేపల్లి సీతానగరంలో నది ఎగువ భాగాన భారీ సంఖ్యలో నాగ ప్రతిమలు కనిపించడంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. పురాతన కాలం నాటివా.. లేక ఎవరైనా తీసుకుని వచ్చారా అని ఆరా తీస్తున్నారు. పాడైన విగ్రహాలు తాలూకు భాగాలు అయ్యి ఉండొచ్చని మరికొందరు వాదిస్తున్నారు. నాగపాము విగ్రహాలు కావడంతో దోషం చుట్టుకోకుండా ఉండేందుకు నదీతీరాన వదిలి వెళ్లి ఉంటారని కొందరు చెబుతున్నారు. నదిలో విగ్రహలు వదలి వెళ్లిన వ్యక్తులు ఎవరా అని స్థానికులలో టెన్షన్ మొదలైంది.


Tags:    

Similar News